Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విరుష్క‌తో బాలీవుడ్ బాద్‌షా స్టెప్పులు... ఉల్లాసంగా జ‌రిగిన ముంబై రిసెప్ష‌న్‌!

  • హాజ‌రైన బాలీవుడ్ అతిర‌థులు
  • డ్యాన్సులు, పాట‌ల‌తో కోలాహ‌లం
  • సోష‌ల్‌మీడియాలో ఫొటోల హ‌ల్‌చ‌ల్‌
విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ‌ల ముంబై రిసెప్ష‌న్ అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌రిగింది. ఈ వేడుక‌లో బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్, విరుష్క జంట‌తో క‌లిసి స్టెప్పులు వేశాడు. ఎప్ప‌టిలాగే విరుష్క జంట కూడా వ‌చ్చిన అతిథుల‌తో క‌లిసి బాలీవుడ్, పంజాబీ పాట‌ల‌కు డ్యాన్సులు చేశారు. షారుక్‌తో న‌టించిన 'ర‌బ్ నే బ‌నాదీ జోడి' సినిమాతోనే అనుష్క శ‌ర్మ బాలీవుడ్ రంగ‌ప్ర‌వేశం చేసింది. ఇటీవ‌ల 'జ‌బ్ హ్యారీ మెట్ సెజ‌ల్‌' సినిమాలో కూడా ఆయ‌న‌తో న‌టించింది. ఇండ‌స్ట్రీలో వీళ్లిద్ద‌రినీ బెస్ట్‌ఫ్రెండ్స్‌గా చెబుతారు. ముంబైలోని సెయింట్ రెజీస్ హోట‌ల్‌లోని ఆస్ట‌ర్ బాల్‌రూమ్‌లో ఈ వేడుక జ‌రిగింది.

ఈ వేడుక‌కు అమితాబ్ బ‌చ్చ‌న్ కుటుంబం, క‌ర‌ణ్ జొహార్‌, క‌త్రినా కైఫ్‌, వ‌రుణ్ ధావ‌న్‌, సిద్ధార్థ్ మ‌ల్హోత్రా, కంగ‌నా ర‌నౌత్‌, ప్రియాంక చోప్రా, శ్రీదేవీ, బోనీ క‌పూర్‌, సారా అలీ ఖాన్‌, బొమ‌న్ ఇరానీ, మ‌హేశ్ భ‌ట్‌, లారా ద‌త్తా, ఏఆర్ రెహ‌మాన్‌, రేఖ, భూమీ ఫ‌డ్నేక‌ర్‌, కృతి స‌న‌న్‌, వాణీ క‌పూర్‌, అదితి రావ్ హైద‌రీ, సాగ‌రిక - జ‌హీర్ ఖాన్ త‌దిత‌రుల‌తో పాటు నీతా అంబానీ కూడా హాజ‌ర‌య్యారు.
virushka
Virat Kohli
Anushka Sharma
mumbai

More Telugu News